logo:premalayam_eluru logo:center_for_human_excellence

ప్రేమాలయంలో జ్ఞాన జ్యోతి

సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్

విద్యార్థులలో నిద్రాణంగా ఉన్న పాఠ్యేతర నైపుణ్యాలను, సృజనాత్మక ఆసక్తులను, సాహిత్యాభిలాషను వెలికి తీసి మెరుగుపెట్టేందుకు, ప్రేమాలయం వృద్ధాశ్రమ కమిటీ సంకల్పించింది. విద్యార్థులకు సలక్షణమైన సుశిక్షణ ఇచ్చి, నైతిక విలువలు పెంపొందించే క్రమంలో ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ను ది 27 మార్చి 2023 సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రేమాలయం ప్రాంగణంలో ప్రారంభించబడినది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జెడి, సిబిఐ గారు ముఖ్యఅతిథిగాను, జిడ్డు కృష్ణమూర్తి అధ్యయన కేంద్రానికి చెందిన శ్రీ నందుల ప్రభాకర్ శాస్త్రి గారు విశిష్ట అతిథిగాను, సర్ సిఆర్ రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మాగంటి ప్రసాద్ గారు మరియు ఉపాధ్యక్షులు శ్రీ వివి బాలకృష్ణా రావు గారు, దీపక్ నెక్సజన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ టి. గంగాధర రెడ్డి గారు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ రావి గోపాల కృష్ణయ్య గారు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, ముఖ్యఅతిథి శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జెడి, సిబిఐ గారు ది 27 మార్చి 2023 సోమవారం ఉదయం 10గంటలకు సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నర్సింగ్ విద్యార్థినులతో వ్యక్తిత్వ వికాశ గోష్టి మరియు మద్యాహ్నం 2 గంటలకు సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, పి.జి., పాలిటెక్నిక్ మరియు డిగ్రీ విద్యార్థులతో ఆవగాహనా సదస్సులలో పాల్గొన్నారు.

ఈ కేంద్రము నందు ప్రముఖ విద్యా, సామాజిక, మనస్తత్వ నిపుణుల ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడే విధంగా తగిన సృజనాత్మక, ఆచరణాత్మక వ్యక్తిగత, సమిష్టి శిక్షణా తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడినవి.

ఈ క్రమంలో ప్రముఖ విద్యావేత్త, వైజాగ్ గురుకుల్ విద్యాలయ తొలి ప్రన్సిపాల్, థింక్ సెల్ లెర్నింగ్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్, సబ్జెక్ట్ అడ్మిన్ టి.సి.ఎస్. అయిన డా. ఇంద్రాణి కేల్కర్ Phd(Maths), IIT Bombay గారు ది. 14-ఏప్రిల్-2023 నుండి 17-ఏప్రిల్-2023 వరకు ఏలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రము నందు విద్యార్థినీ/విద్యార్థులకు సూపర్ మెమొరీ విధానములు, మెమరీ టెక్నిక్స్, బ్రెయిన్ యాక్టివిటీ, బ్రెయిన్ ఎనర్జీ పెంచుకునే విధానములు మొదలైన అంశాలలో శిక్షణ ఇచ్చారు.

ఇదే క్రమంలో యోగా గురువుగారు శ్రీ రామ్ దేవ్ బాబా గారి పత్యక్ష శిష్యురాలు, విశాఖపట్నం ప్రముఖ యోగా ట్రైనర్ అయిన శ్రీమతి జి. కృష్ణశ్రీగారు ది. 20-ఏప్రిల్-2023 నుండి 24-ఏప్రిల్-2023 వరకు ఏలూరు సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ/విద్యార్థులకు యోగ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జెడి, సిబిఐ గారి సందర్శన చిత్రములు

శ్రీమతి జి. కృష్ణశ్రీగారి యోగ శిక్షణా కార్యక్రమ చిత్రములు

Copyright © Premalayam Eluru 20-Nov-2025